ALERT: అతి భారీ వర్షాలు

ALERT: అతి భారీ వర్షాలు

TG: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.