జిల్లా కలెక్టర్‌కు 13వ ర్యాంకు

జిల్లా కలెక్టర్‌కు 13వ ర్యాంకు

తూ.గో: సీఎం చంద్రబాబు గత మూడు నెలలుగా రాష్ట్రంలోని కలెక్టర్ల పనితీరును బట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి 711 ఫైళ్లు స్వీకరించి, 680 ఫైళ్లను పరిష్కరించారు. ఆమె సగటు ప్రతిస్పందన సమయం 1 రోజు 21 గంటల 12 నిమిషాలుగా ఉంది. ఈమె పనితీరు ఆధారంగా ఆమెకు 13వ ర్యాంకు కేటాయించారు.