పట్టణంలో యాక్సిడెంట్.. వృద్ధుడి కాలు చిధ్రం

పట్టణంలో యాక్సిడెంట్.. వృద్ధుడి కాలు చిధ్రం

NLR: కందుకూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోకి వెళ్తున్న ఓ లారీ ఎదురుగా సైకిల్ మీద వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ టైర్ వృద్ధుడి కాలిపైకి ఎక్కింది. కాలు పూర్తిగా చిధ్రం కావడంతో ఆయన బోరున విలపించారు. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.