భూ భారతి సదస్సులపై కలెక్టర్ రివ్యూ

PDPL: రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. ఎలిగేడు తహశీల్దార్ కార్యాలయంలో సదస్సుల నిర్వహణపై రివ్యూ నిర్వహించారు. వచ్చిన దరఖాస్తులపై త్వరితగతిన విచారణ చేసి, పూర్తయిన వాటిని వెంటనే ఆన్‌లైన్‌లో నమోదుచేయాలన్నారు. నోటీసులు జారీచేసి భూభారతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.