ప్రజావాణిలో 348 ఫిర్యాదులు స్వీకరణ

KNR: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 348 ఫిర్యాదులు, వినతులు అందాయి. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి, మున్సిపల్ కమిషనర్ చాహత్ పాల్గొన్నారు.