VIDEO: చేతిలో సెల్ఫోన్.. ఆర్టీసీ డ్రైవర్ బస్సు డ్రైవింగ్!
SDPT: అక్కన్నపేట మండలం నందారం నుంచి హుస్నాబాద్ వెళ్తున్న RTC బస్సులో డ్రైవర్ సంపత్ నిర్లక్ష్యం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. ఒక చేత్తో సెల్ఫోన్ మాట్లాడుతూ.. మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతూ నిబంధనలకు విరుద్ధంగా బస్సు నడిపాడు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.