కథ నచ్చకపోవడంతోనే సుందర్ ఔట్: కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కనుంది. అయితే, ఈ మూవీకి మొదట దర్శకుడిగా ప్రకటించిన సుందర్ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీనిపై కమల్ స్పందిస్తూ... రజనీకి సుందర్ చెప్పిన కథ నచ్చలేదనే కారణంతోనే అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని క్లారిటీ ఇచ్చాడు. నిర్మాతగా హీరోకు నచ్చిన కథను తీసుకురావడం తన బాధ్యత అని కమల్ పేర్కొన్నాడు.