ఇంటి పేరుతో ఇబ్బంది పడుతున్న ఓటర్లు

ఇంటి పేరుతో ఇబ్బంది పడుతున్న ఓటర్లు

WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానానికి 12 మంది పోటీలో ఉండగా, వీరిలో 9 మంది సీనపెల్లి ఇంటి పేరు గల అభ్యర్థులు ఉండడం ఓటర్లకు తలనొప్పిగా మారింది. ఇందులో సీనపెల్లి రాజు అనే పేరుతో ఇద్దరు ఉండటంతో పోలింగ్ సమయంలో ఓట్లు ఎవరికి పడతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకే ఇంటి పేరుతో ఇంతమంది బరిలో దిగడం గ్రామంలో ఆసక్తి రేకెత్తిస్తోంది.