VIDEO: కంభంలో పోషణ పక్వాడ కార్యక్రమం
ప్రకాశం: కంభంలోని ఎస్పీజీ పాలెంలోని అంగన్వాడీ సెంటర్‌లో పోషణ పక్వాడా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ గాలమ్మ మాట్లాడుతూ.. చిన్నారులకు పాలు, గుడ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, జంక్ ఫుడ్ అలవాటు చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, చిన్నారులు పాల్గొన్నారు.