'వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి'
ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. దోర్నాల వద్ద ప్రాజెక్టు, ఫీడర్ కెనాల్ పనులను ఆమె పరిశీలించారు. జూన్ 15 నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజుకు 4 మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలని పేర్కొన్నారు. పనులకు అవసరమైన డీజిల్, గ్యాస్ సరఫరా చేస్తామని వెల్లడించారు.