జాబ్ మేళాలో 151 మంది అభ్యర్థులు ఎంపిక
AKP: ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 151 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు సంస్థ అధికారి గోవిందరావు తెలిపారు. మొత్తం 315 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైనట్లు పేర్కొన్నారు. 18 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.