డ్రగ్స్‌కు బానిస అయితే భవిష్యత్తు అంధకారమే

KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో విద్యార్థులకు, గ్రామస్తులకు డ్రగ్స్ వాడకంపై గురువారం అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు బానిసైతే భవిష్యత్ అంధకారం అవుతుందని సీఐ సదన్ కుమార్, తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల అంజయ్య, ఎస్సై శ్రీకాంత్ గౌడ్, ఎక్సైజ్ ఎస్సై భారతి ఉన్నారు.