అక్రమ మట్టి రవాణాను వ్యతిరేకిస్తున్నాం: సీపీఐ

కృష్ణా: విస్సన్నపేటలో ఆదివారం సీపీఐ మండల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ.. అక్రమ మట్టి రవాణాను వ్యతిరేకిస్తున్నామన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా మట్టి ఉపయోగించాలని అన్నారు. పేదలకు గ్రామాల్లో 3సెంట్లు, పట్టణాల్లో 2సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, పక్షపాతం లేకుండా అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.