మార్చి 19న “శ్రీరామ మాలా ధారణ”
విజయనగరం పూల్ బాగ్‌లో ఉన్న అయోధ్య బాలక్ రామ మందిరంలో మార్చి 19న (ఉగాది నాడు) ఉ 10 గంటలకు “శ్రీరామ మాలా ధారణ” చేపడుతున్నట్లు యనమండ్ర సుబ్రహ్మణ్యం శర్మ స్వామీజీ తెలిపారు. 21 రోజుల దీక్ష అనంతరం ఏప్రిల్ 4 (గురువారం) రామతీర్థంలో “మాలాదీక్ష విరమణ” కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు పాల్గొన్నారు.