గురజాల ఆర్టీసీ బస్టాండ్‌లో చెత్తాచెదారం తొలగింపు
PLD: గురజాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం తొలగించారు. టీడీపీ నేతలు గంట సాంబశివ, జమ్మిగుంపుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రయాణికులకు అసౌకర్యంగా మారిన బస్టాండ్ పరిసరాలు శుభ్రం కావడంతో హర్షం వ్యక్తం చేశారు.