నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల అమలు: కలెక్టర్

PDPL: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టంపై సుల్తానాబాద్ మినహా అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించామన్నారు.