ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్న 'తర్లువాడ'
విశాఖ: 'తర్లువాడ'.. విశాఖ మహా నగరానికి 20KM దూరంలో ఉన్న ఈ గ్రామం జిల్లా ప్రజలకే సరిగా తెలియదు. కానీ ఇప్పుడు ఈ గ్రామం ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. ఈ గ్రామంలో ఉన్న 308 ఎకరాల్లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేయడమే ఇందుకు కారణం. రాంబిల్లి, ముడసర్లోవలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నా ప్రధాన కార్యాకలపాలు తర్లువాడ నుంచే సాగనున్నాయి.