ఈనెల 18 నుంచి కుష్టి వ్యాధి గుర్తింపు కార్యక్రమం
SRCL: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రజిత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ రజిత మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి ఇంటింటికి కుష్టి వ్యాధి గుర్తింపు కార్యక్రమం జరుగుతుంది అని తెలిపారు.