ఐఓబీ బ్యాంకు జనరేటర్ లో నుంచి చెలరేగిన మంటలు
కాకినాడ: పిఠాపురం కోటగుమ్మం వద్ద ఐఓబీ బ్యాంకు జనరేటర్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై ఫైర్ స్టేషన్‌కి ఫోన్ చేయడంతో సకాలంలో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈ సంఘటనలో ఎవ్వరికి ఏం కాకపోవడంతో బ్యాంకు వచ్చిన ఖాతాదారులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.