వెస్ట్- ఈస్ట్ క్రాసింగ్ బషీరాబాగ్ జంక్షన్‌లో మాత్రమే అనుమతి

HYD: నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృత డైవర్షన్లు అమలు చేశారు. ప్రధాన రూట్లు బారికేడ్లతో మూసివేయగా, వెస్ట్- ఈస్ట్ క్రాసింగ్ బషీరాబాగ్ జంక్షన్‌లో మాత్రమే వాహనాలకు అనుమతించారు. కేశవగిరి, చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్‌గంజ్, కోటి, లిబర్టీ, ట్యాంక్‌బండ్, రాణీగంజ్ వంటి ప్రాంతాల్లో కీలక మార్గ మార్పులు అమలులో ఉంటాయి.