రేపటి నుండి చాముండేశ్వరి జయంతి ఉత్సవాలు.

CTR: పుంగనూరులోని తూర్పు మొగసాల వద్ద వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో ఈనెల 17 నుంచి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు బుధవారం అమ్మవారి ఆలయంలో జెట్టి కులస్థులు తెలిపారు. జయంతి ఉత్సవాలు 17 నుండి మొదలై అమ్మవారికి రోజుకొక అలంకరణతో 25 వరకు జయంతి ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అమ్మవారి ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.