అమరావతే మన రాజధాని: MLA
CTR: 'దేవతల ఏలుబడి అమరావతి.. అమరావతే మన రాజధాని' అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పేర్కొన్నారు. బుద్ధుడు నడిచిన పవిత్ర నేల అమరావతి ఏపీ ఏకైక రాజధానిగా అవతరించిందని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం కృషి చేసి రాజధానికి చట్టబద్ధత తీసుకువచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.