LED వీధి దీపాలకు GHMC స్థాయీ సంఘం ఆమోదం

HYD: నగరంలో LED వీధి దీపాల టెండర్లు పూర్తయినందున ప్యానళ్ల నిర్వహణ, కొత్త లైట్ల ఏర్పాటుకు GHMC స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది. రూ. 897 కోట్లతో టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన GHMC ప్రధాన కార్యాలయంలో సమావేశం గురువారం జరిగింది. 39 అంశాలకు సంఘం ఆమోదం తెలిపింది. GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.