పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
తిరుపతిలో పండిట్ జవహర్ లాల్ నెహ్రు పురపాలకొన్నత పాఠశాల, శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు, పదవ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని కలెక్టర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. పరీక్షలు రాసే విద్యార్థులు అస్వస్థకు గురికాకుండా తక్షణం వైద్య సేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు.