సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించిన బాలకృష్ణ

సత్యసాయి: లేపాక్షి మండలం పూలకుంట గ్రామంలో సూర్య ఘర్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ పథకం ద్వారా గ్రామస్తులకు శుభ్రమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యమని పేర్కొంటూ, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.