ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 8న శ్రావణ శుక్రవారం, 9, 10 తేదీల్లో వారంతపు సెలవులు కారణంగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈనెల 11 నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.