VIDEO: ధాన్యం కొనుగోలు ఆలస్యం.. రైతుల రాస్తారోకో

VIDEO: ధాన్యం కొనుగోలు ఆలస్యం.. రైతుల రాస్తారోకో

SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండపాలెంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసినా స్వీకరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కోదాడ-ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నిరసనతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.