ఉచిత 'గ్రూప్స్' శిక్షణకు గడువు పెంపు

ఉచిత 'గ్రూప్స్' శిక్షణకు గడువు పెంపు

KMM: గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ -4 పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్ధులకు జిల్లాలో ఉచిత బేసిక్ ఫౌండేషన్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీ ఫిబ్రవరి 10 వరకు పెంచినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కస్తాల సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. 4 నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. దరఖాస్తులు కలెక్టరేట్‌లోని శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.