21 నుంచి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
NLG: రాములబండలో ఈ నెల 21 నుంచి మార్చి 2 వరకు సీతారామచంద్రస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ విషయాన్ని ధర్మకర్తలు దోమలపల్లి అమరేందర్రావు, విజయ్కుమార్, హరికృష్ణారావు, సందీప్ రావు వెల్లడించారు. 25న నూతన కల్యాణ మండపాన్ని ప్రారంభించి, రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. మార్చి 1న స్వామివారి రథయాత్ర ఉంటుందని తెలిపారు.