'పేద ప్రజలకు మేలు జరుగుతుంది'

SRCL: కేంద్ర బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం వల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ అన్నారు. ఇల్లంతకుంటలో ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు మేలు చేసే విధంగా ప్రధాని మోదీ ఎప్పుడు ఆలోచిస్తారని పేర్కొన్నారు.