రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్థిక స్వలంబన: ఎమ్మెల్యే
BDK: మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ జితేష్ వి పాటిల్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.304 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు విడుదల కావడం మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.