ఆదర్శప్రాయుడు మహాత్మా గాంధీ

SKLM: ఆదర్శప్రాయుడు మహాత్మా గాంధీ అని ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి అన్నారు. కంచిలి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని అహింస మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎంపీడీవో తదితర అధికారులు పాల్గొన్నారు.