గ్రంథాలయ తనిఖీ.. పుస్తకాలు, పాఠకులపై చైర్మన్ దృష్టి

గ్రంథాలయ తనిఖీ.. పుస్తకాలు, పాఠకులపై చైర్మన్ దృష్టి

MLG: ఏటూరు నాగారం మండల గ్రంథాలయానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడి పాఠకుల సంఖ్య పెంచాలని, వారికి అవసరమైన పుస్తకాలను అందించాలని సూచించారు. గ్రంథాలయం పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.