నేను మెగాస్టార్ డైహార్డ్ ఫ్యాన్‌ని: తిలక్ వర్మ

నేను మెగాస్టార్ డైహార్డ్ ఫ్యాన్‌ని: తిలక్ వర్మ

టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తాను మెగాస్టార్ చిరంజీవికి 'డైహార్డ్ ఫ్యాన్' అని తెలిపాడు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలంటే తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలను కూడా ఇష్టంగా చూస్తానని చెప్పాడు. అలాగే, 'RRR' సినిమా చూసి ఫిదా అయ్యానని, తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడం గర్వకారణమని వెల్లడించాడు.