కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ఆధ్వర్యంలో వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి సమక్షంలో వివిధ మండలాలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆమె కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.