నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NDL: కోయిలకుంట్ల గ్రామంలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ అనంతరావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌లైన్ మరమ్మతుల కారణంగా సంత మార్కెట్, బసిరెడ్డి బావి వీధి, గుద్దేటి వీధులకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని, ప్రజలు సహకరించాలని కోరారు.