'కూటమి ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పింది'

'కూటమి ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పింది'

AP: అసెంబ్లీలో కాకి లెక్కలు చెబుతూ కూటమి ప్రభుత్వం కాలం గడిపిందని MLA తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం లెక్కలు వాస్తవాలకు సంబంధం లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అమలు చేయమంటే.. సూపర్ స్కామ్ చేస్తున్నారని అన్నారు. 'జనంతో నడిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది జగన్. అదే జనాన్ని పొడిచి ప్రభుత్వంలోకి వచ్చింది చంద్రబాబు' అంటూ విమర్శించారు.