VIDEO: రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ములుగు మండలంలోని జంగాలపల్లి గ్రామం నుంచి గాంధీనగర్ వరకు రూ.20 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి పాల్గొన్నారు.