నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్

నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్

HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీస్టేడియంలో బహిరంగ సభతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఈ ప్రభావంతో PVNR ఎక్స్‌ప్రెస్ వే నుంచి మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి నాంపల్లి, పంజాగుట్ట నుంచి రవీంద్ర భారతి రూట్‌లో వాహనాలు కిలో మీటర్‌ మేర నిలిచిపోయాయి. హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.