ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆర్‌డీవో

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆర్‌డీవో

W.G: భారీ వర్షాలకు గోదావరి పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం పెదలంక, కనకాయలంక తదితర లంక గ్రామాలను నరసాపురం ఆర్‌డీవో దాసి సోమవారం పరిశీలించారు. లంక గ్రామాల్లో ముందస్తు చర్యలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించారు. ప్రజలకు తాగు నీరు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.