VIDEO: కనువిందుగా పడవ పోటీలు

VIDEO: కనువిందుగా పడవ పోటీలు

కోనసీమ జిల్లా బలుసుతిప్పలో పడవ పోటీలు నిర్వహించారు. స్థానిక మత్స్యకారులు సుమారు 100 పడవలపై ఈ పోటీల్లో పాల్గొన్నారు. నిర్దేశిత ప్రాంతానికి ఎవరైతే ముందుగా చేరుకుంటారో వారికే అక్కడ ఏడాది పాటు చేపలు వేటాడుకునే హక్కు లభిస్తుంది. ఇతరులకు అక్కడ వేట కొనసాగించడానికి అనుమతి ఉండదని మత్స్యకారులు పేర్కొన్నారు. పోటీలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.