VIDEO: కోతుల గుంపుతో హడలిపోతున్న చిట్యాల వాసులు
NLG: చిట్యాలలో గత 20 రోజులుగా కోతుల బెడద తీవ్రమైంది. గుర్తుతెలియని వ్యక్తులు వందల్లో కోతులను వదిలివెళ్లడంతో 5,6,7 వార్డుల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా శాంతినగర్, ఇందిరానగర్, ఎస్సీ కాలనీలో కోతుల దాడికి ఇళ్ల రేకులు దెబ్బతింటున్నాయి. విద్యార్థుల లంచ్ బాక్సులను కూడా కోతులు ఎత్తుకెళ్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.