నేటి నుంచి 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'
JN: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బచ్చన్నపేట(M)లోని 26 గ్రామల్లో ఇవాళ నుంచి ప్రత్యేక డ్రైవ్‌ను అధికారులు ప్రారంభించనున్నారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందచేయటమే లక్ష్యంగా ఈ 99 రోజుల కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తూ గ్రామల్లో నుంచి వ్యవస్థను పటిష్ఠం చేస్తూ సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు.