గిరిరాజ కాలనీ సమస్యలు పరిశీలించిన బీజేపీ నేత

గిరిరాజ కాలనీ సమస్యలు పరిశీలించిన బీజేపీ నేత

సత్యసాయి: ధర్మవరంలోని గిరిరాజ కాలనీ సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ నేత హరీష్ బాబు ఆ కాలనీని సందర్శించారు. వర్షపు నీరు నిల్వ, పాడైన రోడ్లు, డ్రైనేజీ లేకపోవడం వంటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. హరీష్ బాబు అక్కడికక్కడే మున్సిపల్ అధికారులతో మాట్లాడి, డ్రైనేజీ, రోడ్లు, జంగిల్ క్లియరెన్స్ పనులను అత్యవసరంగా చేపట్టాలని సూచించారు.