ఉచిత బైక్ మెకానిక్ శిక్షణ శిబిరం

ఉచిత బైక్ మెకానిక్ శిక్షణ శిబిరం

MDK: ఉచిత బైక్ మెకానిక్ శిక్షణ శిబిరాన్ని యువత వినియోగించుకోవాలని ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 9 నుంచి నెల రోజుల పాటు స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం సంగారెడ్డిలో ఉచితంగా బైక్ మెకానిక్ నేర్పించనున్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు. ఈ నెల 8 వరకు ఆధార్, పదో తరగతి మెమో జిరాక్స్ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.