చీరాల విద్యార్థులకు 'శక్తి' యాప్‌పై అవగాహన
BPT: చీరాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. వన్ టౌన్ సీఐ సుబ్బారావు, శక్తి టీమ్ ఎస్సై హరిబాబు పాల్గొని 'శక్తి యాప్' వినియోగంపై వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు. ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.