పిల్లల్ని ఊరేగింపులకు పంపేటప్పుడు జాగ్రత్త: సీఐ

కృష్ణా: ఉయ్యూరులో వినాయక చవితి నవరాత్రుల ఊరేగింపులపై సీఐ రామారావు ఆదివారం హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ నాయకుల పేర్లతో కులపాటలు, విద్వేషపూరిత వీడియోలు, పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. పర్మిషన్లకు విరుద్ధంగా బ్యానర్లు, డీజే వాడకూడదని, దేవుని ఫోటోలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, కమ్యూనిటీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.