MGBS డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

MGBS డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

HYD: ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమైంది. ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. MGBSలో బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు RTC JAC నేతలు తెలిపారు. కాగా, ప్రభుత్వం దశల వారి పరిష్కారానికి మొగ్గు చూపుతోంది.