నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం: కొమరోలు మండలంలోని నాగిరెడ్డిపల్లిలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. కొత్త లైన్లు వేస్తున్న కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.