సెలవు రోజుల్లో బడులు తెరిస్తే కఠిన చర్యలు: డీఈవో

SKLM: సంక్రాంతి సెలవుల్లో బడులు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈవో ఎస్. తిరుమల చైతన్య తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 10 నుండి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు పాటించాలని, 20వ తేదీన తిరిగి పాఠశాలలు పునః ప్రారం భమవుతాయని డీఈఓ పేర్కొన్నారు. సెలవు రోజుల్లో పాఠశాలలు తెరిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.